Crime Rate : కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో భారీగా తగ్గిన క్రైమ్ రేట్
Crime Rate : ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పదవిలోకి రాగానే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు వంటి ప్రధాన విభాగాల్లో అధిక శాతం తగ్గుదల కనిపిస్తుందని పేర్కొంది.
- By Sudheer Published Date - 09:43 PM, Sat - 28 December 24

గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో ఏపీ ఎంత దారుణంగా ఉందో తెలియంది కాదు..ముఖ్యంగా క్రైమ్ రేట్ (Crime Rate ) తారాస్థాయిలో ఉండేది. నిత్యం ముర్డర్లు , అత్యాచారాలు, దోపిడీలు ఇలా ఒక్కటేంటి ఎన్నో నేరాలు , ఘోరాలు జరుగుతూ ఉండేవి. ప్రభుత్వ అండ చూసుకొని గల్లీ వ్యక్తి దగ్గరి నుండి ఢిల్లీ నేత వరకు ఇలా ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. అంతే ఎందుకు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసేవారంటే ఏ రేంజ్ లో పాలనా జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నేరగాళ్ల నుండి రాష్ట్రం విముక్తి పొందింది. రాష్ట్ర ప్రజలంతా ఏకధాటిగా కూటమి సర్కార్ (TDP Govt) ను భారీ మెజార్టీ తో గెలిపించారు.
ఇక ఇప్పుడు కూటమి సర్కార్ రావడమే ఆలస్యం క్రైమ్ పై ఫోకస్ పెట్టి ఎక్కడిక్కడే కట్టడి చేస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్నీ తాజాగా క్రైమ్ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పదవిలోకి రాగానే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు వంటి ప్రధాన విభాగాల్లో అధిక శాతం తగ్గుదల కనిపిస్తుందని పేర్కొంది. ప్రత్యేకించి రోడ్ల మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రమాదాల సంఖ్య 5 శాతం తగ్గినట్లు నివేదికలో తెలిపింది.
మహిళల భద్రతకు ప్రాధాన్యత :
చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఆరు నెలల పాలనలోనే మహిళలపై జరిగే నేరాలు 9.5 శాతం తగ్గాయి. వరకట్న వేధింపులు 15.49 శాతం తగ్గినట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నేరాల తగ్గుదల :
గత ప్రభుత్వ హయాంలో నేరాల సంఖ్య పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ చంద్రన్న పాలనలో 24.1 శాతం హత్యాయత్నాలు, 25 శాతం దోపిడీలు తగ్గాయి. ముఖ్యంగా అత్యాచారాలు, అత్యాచార యత్నాలు 0.26 శాతం తగ్గడం శాంతి భద్రతల పరిరక్షణలో పెద్ద విజయంగా నిలిచింది. ప్రజల భద్రతను నిర్ధారించడంలో ప్రభుత్వం రాజీ పడడం లేదని ఈ క్రైమ్ రిపోర్ట్ స్పష్టంచేస్తోంది.
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం :
గత ప్రభుత్వ హయాంలో గంజాయి రవాణాకు విచ్చలవిడిగా నడిచింది. కానీ చంద్రబాబు సర్కార్ ఈ సమస్యను ఎదుర్కోవడంలో కీలక చర్యలు తీసుకుంది. ఆరు నెలల కాలంలో 52,479 కేజీల గంజాయిని సీజ్ చేసి, 4,851 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ముఖ్యంగా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం తో అతి తక్కువ టైంలోనే గంజాయి రహిత రాష్ట్రంగా మారింది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఆదర్శం :
చంద్రబాబు పాలనలో రాష్ట్ర శాంతి భద్రతలు అభివృద్ధి చెందినట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయమైనవని చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాల తగ్గుదలతో పాటు, నేరాల నియంత్రణ కూడా ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. ఓవరాల్ గా కూటమి సర్కార్ ప్రజల సర్కార్ అని చెప్పకనే చెపుతుంది.
Read Also : Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాం – నారా లోకేశ్