Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాం – నారా లోకేశ్
Manmohan Singh : ఆయన తమ కుటుంబానికి చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు
- By Sudheer Published Date - 08:47 PM, Sat - 28 December 24

మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్(Manmohan Singh)ను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్మరించుకున్నారు. ఆయన తమ కుటుంబానికి చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అలిపిరి ఘటన (Alipiri Incident) తర్వాత టీడీపీ పార్టీ ఓటమి చెందడం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు(Chandrababu)కు భద్రత తగ్గించడంపై నారా లోకేశ్ స్పందించారు. ఈ సమస్యను మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన విశాల హృదయంతో ఆలోచించి చంద్రబాబుకు పూర్తి భద్రత కేటాయించాలని ఆదేశించినట్లు తెలిపారు.
“అప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయం మా కుటుంబానికి మేలు చేసింది. ఆ సమయంలో ఆయన చూపిన సానుకూల వైఖరి మాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది” అని నారా లోకేశ్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల చంద్రబాబు మరింత ధైర్యంగా, నిశ్చింతగా తన రాజకీయ పయనాన్ని కొనసాగించగలిగారని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ నిజమైన నేత, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలో ముందుండేవారు. వ్యక్తిగత సమస్యలపై కూడా ఆయన చూపిన శ్రద్ధ ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అని కొనియాడారు.
కాగా, మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు శుక్రవారం ప్రధాని మోడీ, అధ్యక్షుడు ముర్ము సహా దేశంలోని నాయకులందరూ ఆయన నివాసంలో నివాళులర్పించారు.
As India mourns the passing of former Prime Minister Dr. Manmohan Singh, I am reminded of his large-heartedness and graciousness towards our family.
The year 2004 was a particularly difficult time for us. Our leader Mr. Chandrababu Naidu had recently recovered from an attempt on… pic.twitter.com/1v44f8buNl
— Lokesh Nara (@naralokesh) December 28, 2024
Read Also : Ravi Shastri Emotional : నితీశ్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన రవిశాస్త్రి