ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్టెండర్ పత్రాల మార్గదర్శకాలలో కాంట్రాక్టు సంస్థలు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమించుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయోపరిమితిని 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గించడం పూర్తిగా అన్యాయమని.. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వేయి మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలను ఈ నిర్ణయం ప్రమాదంలో పడేసిందని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, వర్కర్స్ యూనియన్ సభ్యులు విమర్శిస్తున్నారు.
మరోవైపు ఇటీవలి కాలంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పనిచేస్తున్న 50 ఏళ్లు దాటిన పారిశుద్ధ్య కార్మికులను.. కాంట్రాక్టర్లు టెండర్ మార్గదర్శకాల ఆధారంగా తొలగిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. అయితే APMSIDC మార్గదర్శకాలలో 50 ఏళ్లు దాటిన వారిని కొత్త నియామకాల్లో నియమించకూడదని మాత్రమే పేర్కొందని.. పాత వారిని తొలగించాలని చెప్పలేదంటున్నారు. మరోవైపు ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 50 ఏళ్లు పైబడిన వేయిమందికి పైగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని అంచనా.
వీరికిప్రతినెలారూ.18600 వేతనంఅందిస్తున్నారు. ఇందులోపీఎఫ్, ఈఎస్ఐవంటిప్రయోజనాలుకూడాఉన్నాయి. అయితేమున్సిపల్శాఖలోనికాంట్రాక్టుపారిశుద్ధ్యకార్మికులపదవీవిరమణవయసుప్రస్తుతం 60 ఏళ్లుగాఉందనిఏపీమెడికల్కాంట్రాక్ట్ఉద్యోగులు, వర్కర్స్యూనియన్సభ్యులుచెప్తున్నారు. కానీప్రభుత్వఆస్పత్రులలోపనిచేసేకాంట్రాక్టుపారిశుద్ధ్యకార్మికులకుమాత్రం 50 ఏళ్లకుపరిమితంచేయడంన్యాయమాఅనిప్రశ్నిస్తున్నారు. వారిమాదిరిగానేతాముకూడాపనిచేస్తున్నామనిచెప్తున్నారు. అయితే ఏపీఎంఎస్ఐడీసీ వాదన మరోలా ఉంది. 50 ఏళ్లు దాటిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని.. వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్తోంది.