CM Jagan : సీఎం జగన్ మాట తప్పాడంటూ సీఐడీకి ఫిర్యాదు చేసిన మేదరకుల సంఘం అధ్యక్షుడు
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే
- By Sudheer Published Date - 08:56 PM, Thu - 23 November 23

ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పాడంటూ సీఐడీకి ఫిర్యాదు చేసాడు మేదరకుల సంఘం (Medrakula Sangam president) అధ్యక్షుడు నరసింహారావు (Narasimharao). జగన్ (CM Jagan) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర (Padayatra) చేసి అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆలా ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ వాటిలో చాలావరకు నెరవేర్చలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలు , రాష్ట్ర ప్రజలు మళ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఆ హామీల ప్రస్తావన తీసుకొస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మేదరకుల సంఘం అధ్యక్షుడు నరసింహారావు సైతం తమకు ఇచ్చిన హామీలు జగన్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..జగన్ ఫై చర్యలు తీసుకోవాలని సీఐడీకి పిర్యాదు చేసాడు.
We’re now on WhatsApp. Click to Join.
తాను అధికారంలోకి వస్తే మేదరకులస్తులను (caste community) ఎస్సీ జాబితాలో చేరుస్తానని, ఏపీ ప్రత్యేక హోదా తీసుకొస్తానని పాదయాత్ర చేస్తున్నప్పుడు హామీ ఇచ్చారు. 2019 ఏలూరు బీసీ గర్జన సభలోనూ మేదర కులస్తులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని జగన్ పట్టించుకోలేదని ఆరోపిస్తూ..జగన్ తో పాటు వైసీపీకి చెందిన 151 ఎమ్మెల్యేలు , ఎంపీలపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదు పత్రాన్నిమీడియాకు చూపించారు.
Read Also : Prakash Raj : ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్..