HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Complaint Filed In Ap High Court Seeking Restriction On Liquor

Liquor : మద్యం విషయంలో పరిమితి పెట్టాలని ఏపీ హైకోర్టు లో పిర్యాదు

Liquor : ఒక వ్యక్తి నెలకు ఎంత మద్యం కొనుగోలు చేయాలో పరిమితి పెట్టాలని ఆమె కోరారు. ఆధార్ కార్డు ద్వారా ట్రాకింగ్ చేస్తూ, ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనుగోలు చేసాడనేది యాప్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది

  • Author : Sudheer Date : 24-04-2025 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Complaint Filed In Ap High
Complaint Filed In Ap High

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మద్యం (Liquor ) వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం (Vizag) కు చెందిన డాక్టర్ షిరిన్ రెహ్మాన్ (Dr. Shirin Rehman) ఈ పిల్ ను దాఖలు చేశారు. ఒక వ్యక్తి నెలకు ఎంత మద్యం కొనుగోలు చేయాలో పరిమితి పెట్టాలని ఆమె కోరారు. ఆధార్ కార్డు ద్వారా ట్రాకింగ్ చేస్తూ, ఒక వ్యక్తి ఎన్ని బాటిళ్లు కొనుగోలు చేసాడనేది యాప్ ద్వారా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది. దాంతో మద్యం దుర్వినియోగాన్ని నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్

ఈ పిటిషన్‌లో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. 21 సంవత్సరాల లోపు వారు మద్యం కొనుగోలు చేయకుండా కఠిన నిషేధం ఉండాలని డాక్టర్ షిరిన్ కోరారు. యువతలో మద్యం వినియోగం పెరుగుతోందని, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు అధికంగా తాగుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరిన మద్యం వినియోగం వల్ల ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరిస్తుండటంతో, మద్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏకంగా పన్ను చెల్లించే ప్రజలపైనే భారం వేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ పిల్‌ను హైకోర్టు స్వీకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై స్పష్టమైన వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ ఖజానాకు మద్యం విక్రయాల నుంచి అధిక ఆదాయం వచ్చినా, ప్రజల ఆరోగ్యానికి కేటాయించే ఖర్చులు కూడా అధికంగానే ఉన్నాయి. దీనికి తోడు ప్రజల ఆరోగ్య భద్రత కోసం, మద్యం వినియోగాన్ని నియంత్రించే విధానాలు తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ ఈ పిల్ అమలులోకి వచ్చినా, లేకపోయినా ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టి, బాధ్యతతో కూడిన చర్యలు తీసుకుంటేనే సమాజానికి మేలని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP high court
  • ap liquor
  • Dr. Shirin Rehman
  • liquor
  • vizag

Related News

Minister Nara Lokesh consoles Steel Plant victims.

Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు. మంత్రి లోకేశ

    Latest News

    • Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

    • Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

    • Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

    • Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd