Simhachalam Incident : సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్
Simhachalam Incident : ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్‌కు ఉంటాయి
- By Sudheer Published Date - 08:34 PM, Wed - 30 April 25

విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన ఘటన(Simhachalam Wall Collapse)లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ (Commission of Inquiry) జరిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం, దీనిపై ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ విచారణ కమిషన్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ (Suresh) ని అధ్యక్షుడిగా నియమించగా, సభ్యులుగా సీనియర్ IPS అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు గారిని నియమించారు. ఈ కమిషన్ బాధ్యతగా ప్రమాదానికి కారణాలపై లోతుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిషన్ సభ్యుల ఎంపికలో అనుభవజ్ఞులైన అధికారులను ఎంపిక చేయడం గమనార్హం.
New CS Ramakrishna Rao : సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. ప్రజల భద్రత, ఆలయ నిర్వహణ లోపాలపై స్పష్టత రావడానికి ఈ కమిషన్ కీలకంగా మారనుంది. ప్రభుత్వ చర్యపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రమాద బాధితులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపారు.
ఇక మంగళవారం అర్థరాత్రి నుంచి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సింహాచలం ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాక.. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.