Investments : పెట్టుబడులతో రాష్ట్రానికి రండి – మంత్రి లోకేశ్
Investments : రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు కీలకం అని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేశ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టులను ఏపీలో ప్రారంభించి, ఇక్కడి వనరులను, మానవశక్తిని వినియోగించుకోవాలని కోరారు
- By Sudheer Published Date - 08:30 AM, Mon - 8 September 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని ఏపీ మంత్రి లోకేశ్ (Lokesh) పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ
పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సింగిల్ విండో అనుమతులను అందిస్తుందని లోకేశ్ తెలిపారు. దీనివల్ల అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అన్నారు. అంతేకాకుండా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరియు ‘ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ’ విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఒకసారి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో రాష్ట్రానికి వస్తే, ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత తమదేనని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు కీలకం అని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేశ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టులను ఏపీలో ప్రారంభించి, ఇక్కడి వనరులను, మానవశక్తిని వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో, పారిశ్రామిక మిత్ర వైఖరితో ఆంధ్రప్రదేశ్ త్వరలో ఒక పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.