HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Come Out Of The Government And Speak Pawan Former Mla

Former MLA: మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడు పవన్: మాజీ ఎమ్మెల్యే

తిరుపతి తొక్కిసలాట ఘటన నేపాన్ని వైసీపీపై నెట్టే కుట్ర చేస్తున్నారని మాజీ ఎంపీ మండిప‌డ్డారు.

  • Author : Gopi Date : 10-01-2025 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Former MLA: ఏపీలో తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై టీడీపీ కూట‌మి, ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే (Former MLA) తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కామెంట్స్

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తిరుపతిలో తొక్కిసలాట ఎన్నడూ జరగలేదు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? పోలీసులంతా చంద్రబాబు పర్యటనలో నిమగ్నం అయ్యారు. భక్తుల భద్రతను చంద్రబాబు సర్కార్ గాలికి వ‌దిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికార యంత్రాంగంపై పట్టులేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ పదుల సంఖ్యలో హిందువులు మృతి చెందుతున్నారు. సనాతన ధర్మం ప్రతినిధి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత వహించరు? పవన్ కళ్యాణ్ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో తొక్కిసలాట ఘటనలు జరగలేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. దేవాదాయ శాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి. పవన్ కళ్యాణ్ పదేపదే మొసలి కన్నీరు కారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. పోలీసు బలగాలన్నీ కుప్పం ముఖ్యమంత్రి పర్యటనకు, బాలకృష్ణ డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లాయి. తిరుప‌తికి వచ్చే భక్తుల భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Pocso Case : చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్‌

తిరుపతి తొక్కిసలాట ఘటన నేపాన్ని వైసీపీపై నెట్టే కుట్ర చేస్తున్నారని మాజీ ఎంపీ మండిప‌డ్డారు. ఆయ‌న మాట్లాడుతూ.. తిరుపతి తొక్కిస‌లాట ఘటనను టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తప్పిదాన్ని వెంకటేశ్వర స్వామిపై నెట్టారు. తొక్కిసలాట దైవ నిర్ణయం అన్న బిఆర్ నాయుడు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిపై కేసు నమోదు చేస్తారా? అని ప్ర‌శ్నించారు. హైందవ సమాజం తిరుపతి తొక్కిసలాటను గమనించాలి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వర్గానికి వెళ్లాలనుకున్న భక్తులను తొక్కిసలాటతో చంపి ఈ ప్రభుత్వం నరకానికి పంపించింది. టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలుకు బదులు… డెత్ సిక్స్ అమలు చేశారు. తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ‌ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి. టీటీడీ వ్యవహారాల్లో పోలీసుల పాత్ర నామమాత్రం. పోలీసులను బలి పశువు చేయొద్దు. ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • DCM Pawan
  • Stampede
  • tdp
  • Tirupati
  • tirupati stampede
  • Vaikunta Dwara Sarva Darshan
  • ycp

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd