HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Coalition Governments Good News A Massive Increase In Stipend For Trainee Constables

కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-12-2025 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
5,757 Constables Inducted I
5,757 constables inducted into A.P. Police; monthly stipend hiked to ₹12,500

Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపికబురు వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొ్న్న చంద్రబాబు.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4 వేల 500 రూపాయల నుంచి 12 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రైనీ కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్ వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రోజున మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. డిసెంబర్ 22 నుంచి వీరికి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు చంద్రబాబు తీపికబురు వినిపించారు.

శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం అందించే స్టైఫండ్‌ మొత్తాన్ని రూ.4500 నుంచి, ఒకేసారి మూడు రెట్లు పెంచి, రూ.12,500 చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వేదికపై నుంచి ప్రకటించారు. దీంతో ట్రైనీ కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఏపీ యువత కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం నాలుగు సంవత్సరాలు ఎదురుచూశారన్న చంద్రబాబు.. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై వేసిన కేసులను అధిగమించి.. ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

తన హయాంలోనే 23 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు వస్తాయని.. వేరేవాళ్లు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు పోతాయని చంద్రబాబు అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు ఈ కార్యక్రమంలో మాట్లాడిన హోం మంత్రి వంగలపూడి అనిత.. నాలుగేళ్ల తర్వాత కానిస్టేబుల్‌ అభ్యర్థుల కల ఇవాళ సాకారమైందని అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలపై కోర్టులో కొంతమంది కేసులు వేశారని, ఆ కేసులను పరిష్కరించుకొని.. నియామక పత్రాలు అందజేశామన్నారు. ప్రజా భద్రతే ప్రగతికి పునాది అనే నమ్మకంతో పని చేస్తున్నామన్నారు.

పోలీస్ యూనిఫామ్‌ను బాధ్యతగా భావించాలని.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని కానిస్టేబుల్ అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థుల తల్లిదండ్రులు కూడా పోలీస్ ఉద్యోగంలో ఉండే కష్టాలను అర్థం చేసుకోవాలని హోం మంత్రి అనిత సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh Govt
  • AP CM Chandrababu Naidu
  • AP Kutami Govt
  • constables
  • Stipend Hike

Related News

Ap Transport Department

ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

ఏపీలో 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ 24 గంటల్లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్‌గా 24 గంటల తర్వాత ఆమోదం పొందినట్లే లెక్క. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనాల రిజిస

  • Varma

    Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd