CM Chandrababu: ప్రజా సమస్యలను వినేందుకు కాన్వాయ్‌ని ఆపిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి సచివాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రజలు తమ బాధలను చెప్పుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ రోడ్డుపైకి వస్తుండగా.
- Author : Praveen Aluthuru
Date : 12-07-2024 - 4:37 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu:) నివాసం దగ్గర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అయన కోసం తరలి వచ్చిన ప్రజల కోసం కాన్వాయ్ ఆపడం సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి సచివాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రజలు తమ బాధలను చెప్పుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ రోడ్డుపైకి వస్తుండగా.. కొందరు వ్యక్తులు సార్ అని కేకలు వేయడం గమనించి.. వెంటనే వాహనాన్ని ఆపి బయటకు వచ్చి వారి గోడు విన్నవించి అర్జీలు తీసుకున్నారు. వారి సమస్యలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రాలతో ఉన్న కొందరు మహిళలను గుర్తించిన సీఎం చంద్రబాబు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర సీఎం కాన్వాయ్(Convoy) తమ కోసం ఆగడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు.అయితే ప్రజలు తమ సమస్యలను వినిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించి, పిటిషన్లను సేకరించేందుకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ గురించి ప్రజలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో మరియు సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు చొరవను మరియు తన నిబద్ధతను ప్రజలు కొనియాడుతున్నారు.
Also Read: Weight Gain: బరువు పెరగాలనుకుంటున్నారా.. ఈ రోటి తినాల్సిందే?