AP : జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది – నారా లోకేష్
- Author : Sudheer
Date : 17-12-2023 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయ్యింది..మరో మూడు నెలల్లో అరాచక పాలన ముగిసిపోతుందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు.
”జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. ప్రజా రాజధాని అమరావతి (Amaravati) అజరామరమై నిలుస్తుంది” అని లోకేష్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20 తో ముగుస్తుంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా భోగాపురంలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టిడిపి శ్రేణులు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు స్వాగతం పలుకుతున్నారని , రాష్ట్రంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా యువకులు కదిలిరాబోతున్నారని గంటా చెప్పుకొచ్చారు.
అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను అంతం చేసేందుకు లక్షలాది మంది ప్రజలు సన్నద్దం అయ్యారని, అందుకే నవ్యాంధ్రను పరిరక్షించుకునేందుకై చేసే ఈ యాత్రకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు కన్నీళ్లు, కష్టాలతోనే ఉన్నారన్నారు. జగన్ ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా కేవలం ప్రతిపక్షాల మీద దాడి చేయడంతోనే బిజీ అయ్యారన్నారు.
Read Also : Aishwarya Rai Networth: విడాకులు ఇస్తే ఐష్ కు ఎంత భరణం దక్కుతుంది?