CM Jagan: సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన 2వ రోజు
సీఎం జగన్ 23, 24, 25 తేదీల్లో వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
- Author : Praveen Aluthuru
Date : 24-12-2023 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
CM Jagan: సీఎం జగన్ 23, 24, 25 తేదీల్లో వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అందులో భాగంగా ఈ రోజు వైస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు వైస్ జగన్. అందులో భాగంగా ఆయన సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ నుంచి బయలుదేరి వైఎస్‌ఆర్ ఘాట్ నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తర్వాత సింహాద్రిపురంలో రోడ్డు విస్తరణ, సుందరీకరణ, వైఎస్‌ఆర్ పార్కు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం వైస్ జగన్. సాయంత్రం 4.45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
రేపు 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
Also Read: AP Congress : ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణికం ఠాగూర్