HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababus Remarks At The 7th Phase Collectors Conference

Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 12:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference
CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు అందరి సమష్టి కృషి ఫలితమని సీఎం పేర్కొన్నారు.

గత పాలనలో రాష్ట్రం విధ్వంసం.. రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతోపన్యాసం చేస్తూ, రాష్ట్ర పరిపాలనపై తన దార్శనికతను, ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. “గత పాలకుల నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మనకు సంక్రమించాయి. అంతేకాకుండా, 94 కేంద్ర పథకాల నుంచి సుమారు రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. చెల్లించాల్సిన బిల్లులు రూ.1.30 లక్షల కోట్లు కూడా మనపైనే రుద్దారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడి విధ్వంసమయ్యాయి” అని చంద్రబాబు వివరించారు.

సంపద సృష్టితోనే సంక్షేమం.. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి
ప్రస్తుతం తమ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. “సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేవి ఒకదానికొకటి ముడిపడిన చక్రం లాంటివి. అభివృద్ధి లేకుండా సంపద రాదు, సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదు. డబ్బులు లేవని కూర్చోవడం కాదు, సంపదను సృష్టించే పని చేయాలి, చేద్దాం” అని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వం విజయవంతమవుతుందని స్పష్టం చేశారు.

జవాబుదారీతనం అత్యంత ముఖ్యం
పరిపాలనలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. “ప్రజల నుంచి వచ్చే ఆర్థికేతర ఫిర్యాదులను 100 శాతం పరిష్కరించాల్సిందే. కొందరు అధికారులు వాటిని పైకి కిందకు తిప్పుతున్నారు, ఈ వైఖరి మారాలి. ఆర్థికపరమైన ఫిర్యాదులపైనా విచారణ జరిపి, అర్హమైన వాటిని వెంటనే పరిష్కరించాలి. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలి” అని అధికారులకు గడువు విధించారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని సీఎం వివరించారు. “నా కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేయడం గర్వంగా భావించేవాళ్లం. అలాంటి దిగ్గజ సంస్థను ఇప్పుడు ఏపీకి తీసుకువచ్చాం. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి. రూ.23 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి” అని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు డేటా, ఏఐ, క్వాంటం టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రుల సింగపూర్ పర్యటన వివరాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, విద్య-వైద్యం వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో సమీక్షించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Chandrababu Naidu
  • AP Collectors Conference
  • AP Vision 2047
  • AP welfare schemes
  • Collectors Conference
  • Economic Development

Related News

Varma

Pithapuram వర్మపై టీడీపీ వేటు

2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేస

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

  • DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh

    DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

Latest News

  • TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

  • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

  • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

  • Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్

Trending News

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd