HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu To Visit Singapore For 6 Days

CM Chandrababu: సింగ‌పూర్‌కు సీఎం చంద్ర‌బాబు.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్‌షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

  • Author : Gopi Date : 26-07-2025 - 6:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
Cm Chandrababu

CM Chandrababu: రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu)సింగపూర్ లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ప్రయాణమవుతున్న సీఎం… జూలై 27 ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఐదు రోజుల పాటు సింగపూర్‌లో ఆ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే వివిధ ప్రాంతాలను సందర్శింనున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారు.

27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సిఎం చంద్రబాబు బృందం…పర్యటనలో తొలి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు హాజరవుతారు. ఏపీ ఎన్ఆర్టీ సౌసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు డయాస్పోరా’కు దాదాపు 1,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువతకు భారత్ తో పాటు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేలా చేయటం , ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు, నైపుణ్యాభివృద్ధి కల్పన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై తెలుగు డయాస్పోరా సమావేశం దృష్టి సారించనుంది. అలాగే తెలుగు డయాస్పోరా వేదిక నుంచి జీరో పావర్టీ మిషన్ లో భాగమైన -P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు.

Also Read: Vijay Devarakonda Kingdom : ‘కింగ్‌డమ్‌’ రివ్యూ ఇచ్చేసిన డైరెక్టర్

తొలిగంట నుంచే పారిశ్రామికవేత్తలతో భేటీ

సింగపూర్ కు చేరుకున్న అనంతరం తొలి గంట నుంచే ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామిక వేత్తలు, సింగపూర్ లో భారత హై కమిషనర్ లతో వరుసగా భేటీ కానున్నారు. విమానాశ్రయం నుంచి బస చేసే హోటల్ కు చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ కానున్నారు. అనంతరం 11:30 గంటలకు సింగపూర్ లోని ప్రముఖ సంస్థ సుర్బనా జురాంగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మద్యాహ్నం 12.30 గంటలకు ఎవర్‌సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏ.కె. నాథన్ తో పెట్టుబడుల అంశంపై చర్చించనున్నారు. సాయంత్రం భారత హైకమీషనర్ నివాసంలో విందు సమావేశానికి ముఖ్యమంత్రి పాల్గోనున్నారు.

పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అధ్యయనం

పర్యటనలో రెండో రోజు జూలై 28 తేదీన సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం సింగూర్ లోని బిడదారి ఎస్టేట్ ను ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. సస్టైనలబుల్ అర్బన్ డెవలప్మెంట్ పై నిర్వహించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు లోనూ సీఎం బృందం పాల్గోనుంది. యువతకు క్రీడలపై ఆసక్తి కలిగించేలా సింగపూర్ నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్ ను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సందర్శించనున్నారు. పోర్ట్ ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టు ఆధారిత ఎకో సిస్టం తదితర అంశాలను కూడా పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బృందం టువాస్ పోర్టులో పర్యటించనుంది. పెట్టుబడిదారులతో నెట్‌వర్కింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్‌షో కార్యక్రమంలోనూ ము్యమంత్రి పాల్గోంటారు.

సింగపూర్ బిజినెస్ లీడర్లతో భేటీలు

ముఖ్యమంత్రి బృందం జూలై 29 తేదీన ఏఐ సింగపూర్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, కేప్పెల్ , జీఐసీ లాంటి ప్రముఖ సంస్థలతో వరుసగా భేటీ కానుంది. ఐటీ, ఫిన్ టెక్ బిజినెస్ రౌండ టేబుల్ లో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై చర్చలు జరుపనున్నారు. అనంతరం సింగపూర్ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే సింగపూర్ మాజీ ప్రధాన మంత్రి లీ హ్సియన్ లూంగ్‌తో సమావేశం అవుతారు. సింగపూర్ లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శించి పారిశ్రామిక అభివృద్ధి మోడల్‌పై అధ్యయనం చేస్తారు. అలాగే సింగపూర్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో పోర్టులు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చర్చలు, సమావేశాలు

నాలుగో రోజు పర్యటనలో భాగంగా జూలై 30 తేదీన సీఎం కేపిటా ల్యాండ్, సుమితోమో మిట్సుయి బ్యాంక్, టెమసెక్ సంస్థలతో సీఎం సమావేశం అవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం భేటీ కానున్నారు. జూలై 31 తేదీ సింగపూర్ హోం మంత్రి కే.షణ్ముగంతో పాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం అదే రోజు రాత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఐదు రోజుల పర్యటన, 29 కార్యక్రమాలు

ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్‌షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్‌మెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్‌టెక్ రంగాల్లో అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. ఈ పర్యటన రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గేట్‌వేగా నిలవనుంది. క్రీడారంగం అభివృద్ధి, పోర్ట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ముందడుగు పడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • Hyd To Singapore
  • singapore
  • Singapore Visit

Related News

Apsrtc

APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd