CM Chandrababu: శ్రీశైలం ఆలయలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు సంప్రదాయ దుస్తులు ధరించారు.
- By Latha Suma Published Date - 01:53 PM, Thu - 1 August 24

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయాని(Srisailam Mallanna temple) చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి.. జలహారతి ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది.. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు.
Read Also: Tata Avinya EV: అద్భుతమైన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న టాటా కార్?