HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Paid Tributes To The Nara Rammurthy Naidu

Rammurthy naidu : రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

.తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు.

  • Author : Latha Suma Date : 16-11-2024 - 7:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu paid tributes to the Nara Rammurthy naidu
CM Chandrababu paid tributes to the Nara Rammurthy naidu

Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో తన తమ్ముడు రామ్మూర్తినాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన సోదరుడి కుమారులైన రోహిత్, గిరీష్‌ను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

ఇకపోతే..నారావారిపల్లెలో రేపు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేణిగుంట విమానాశ్ర‌యానికి తీసుకువెళ్ల‌నున్నారు. అక్కడి నుండి నారావారిపల్లికి త‌రలిస్తారు. ఈ మేరకు రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా రామ్మూర్తి నాయుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్పించగా ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994 నుండి 1999 వరకు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు భార్య ఇందిర‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో నాటకాలపై ఉన్న ఆసక్తితో స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గా పనిచేశారు. అనంతరం చంద్రబాబుకు రాజకీయాల్లో అండగా ఉండేవారు. 1992లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అక‌స్మాత్ముగా ఆయ‌న చ‌నిపోవ‌డంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక రామ్మూర్తి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, ఏపీ మంత్రి నారాయణ రామ్మూర్తి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read Also: Manipur : మణిపూర్‌లో ఉద్రిక్తతలు..భద్రతా బలగాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIG Hospital
  • CM Chandrababu
  • hyderabad
  • Nara Ramamurthy Naidu
  • Naravaripalle
  • tributes

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Hyd Parking

    Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd