CM Chandrababu : అనుకూలించని వాతావరణం.. తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయాణానికి వాతావరణం అడ్డంగా నిలిచింది.
- By Kavya Krishna Published Date - 12:32 PM, Tue - 1 July 25

CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయాణానికి వాతావరణం అడ్డంగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం సీఎం ఈ రోజు కొవ్వూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌లో గన్నవరం నుంచి కొవ్వూరు బయలుదేరారు సీఎం చంద్రబాబు.
అయితే, కొవ్వూరులో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కే తిరిగివచ్చి ల్యాండ్ అయింది. దీంతో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టారు. హెలికాప్టర్ మార్గం వాయిదా పడడంతో, సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడి నుంచి రోడ్ మార్గంలో కొవ్వూరు చేరి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. లబ్ధిదారుల ఇంటికి స్వయంగా సీఎం చంద్రబాబు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయనున్నారు. కాపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొన్ని పీ-4 పథకం కింద నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకునే వారితో ముఖాముఖి సంభాషిచనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం కాపవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని, కాపవరం నుంచి 3.30 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
Physical Harassment : నల్గొండలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసిన ఆర్ఎంపీ