CM Chandrababu : రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.. ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారు.
CM Chandrababu : టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాజకీయంగానూ దుష్ప్రచారానికి గురయ్యామని గుర్తు చేశారు.
- By Kavya Krishna Published Date - 02:05 PM, Sun - 29 June 25

CM Chandrababu : టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాజకీయంగానూ దుష్ప్రచారానికి గురయ్యామని గుర్తు చేశారు. ఇకపై ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. “గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, మేము కేంద్ర పథకాల ఉపయోగం కూడా జరగనివ్వలేదు. ఇప్పుడు ఆ విధ్వంస స్థితి నుంచి వికాస దిశగా అడుగులు వేస్తున్నాం” అని అన్నారు.
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమని, అధికారాన్ని సాద్యంగా చూసే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు టీడీపీ దూరమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటోందని, ముఖ్యంగా పామాయిల్, మిర్చి, పొగాకు రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. దీపం పథకంలో సిలిండర్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.
అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని గుర్తు చేసిన చంద్రబాబు, వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల అవుతాయని తెలిపారు. అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులు వచ్చినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్, కృష్ణపట్నం పోర్టు, మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాల ప్రగతిని వివరించారు.
“ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదే ముఖ్యం. ప్రతి స్థాయిలో సర్వేలు జరిగాయి. ఒకరు చేసిన పనులు చెప్పగలగాలి. అలా చేస్తే ప్రజల విశ్వాసం పెరుగుతుంది” అని అన్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు సమర్థమైన సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు, టీడీపీని ఒక కుటుంబంలా అభివర్ణిస్తూ — ఎర్రంనాయుడు సేవలు గుర్తు చేసి, ఆయన కుమారుడు కేంద్ర మంత్రిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు.
డబ్బులతో గెలవాలన్న ఆలోచన పని చేయదని స్పష్టం చేసిన సీఎం, “500 నోట్లను కూడా రద్దు చేయాలని నేను అన్నా. సమర్థవంతమైన పాలన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుంది” అన్నారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి అభివృద్ధికి దోహదపడేలా చేస్తామని పేర్కొన్నారు.
Trump: సెనెట్‌లో గొప్ప విజయం దక్కిందన్న ట్రంప్