Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.
- By Latha Suma Published Date - 12:51 PM, Sat - 16 November 24

Nara Ramamurthy Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా నుండి ఆయన అనారోగ్యం బారిన పడిన ఉన్నారు. దీంతో రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా, ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.
మరోవైపు సీఎం చంద్రబాబు ఇప్పటికే మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారం కార్యక్రమాలు రద్దుచేసుకున్నారం.. ఈ క్రమంలో మధ్యాహ్నం నేరుగా ఏఐజీ ఆస్పత్రిక వెళ్లనున్నట్లు తెలుస్తొంది. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తొంది. అయితే.. నారా రామ్మూర్తి నాయుడు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నారా కుటుంబం ఈ ఘటనతో షాక్ లో ఉన్నారంట. నందమూరీ బాలయ్య కూడా నేరుగా హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు టీడీపీ వర్గాలు, మరోవైపు నారా వారి కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
కాగా, ఈరోజు నారా రామ్మూర్తి నాయుని ఈరోజు నారావారి పల్లెకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా వారి పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకొవచ్చు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి మరణవార్త తెలిసిన టీడీపీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Read Also: YSRCP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా!