YSRCP: తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా!
వైసీపీకి పెద్ద షాక్, 11 మంది కౌన్సిలర్లు రాజీనామా. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలు పంపారు.
- By Kode Mohan Sai Published Date - 12:50 PM, Sat - 16 November 24

ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి (YSRCP) వరుస షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీలో చేరిన నేతలు, ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నారు. పార్టీలోని ఆ పార్టీ అధినేత జగన్‌కు (YS Jagan) అత్యంత సన్నిహితులైన వారు కూడా పార్టీపై పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీకి (YSRCP) భారీ షాక్ తగిలింది. ఈ ప్రాంతంలో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు. ఈ కౌన్సిలర్లు వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నామని పేర్కొంటూ, పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలు పంపించారు.

Ycp Leaders Resign
నిడదవోలు మున్సిపాలిటీలో 27 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి (YSRCP) 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి 16 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. రాజీనామా చేసిన వారిలో ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఉన్నారు, దీంతో వైసీపీ (YSRCP) మున్సిపాలిటీపై పూర్తిగా పట్టు కోల్పోయినట్లయ్యింది.
ఈ పరిణామంతో, మరికొంత మంది కౌన్సిలర్లు కూడా త్వరలో వైసీపీని (YSRCP) వీడి మరో పార్టీకి చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే, నిడదవోలులో వైసీపీ (YSRCP) ఖాళీ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిడదవోలులో జనసేన పార్టీ (Janasena Party) సత్తా చూపుతోంది. రాజీనామా చేసిన వారంతా జనసేనలో (Janasena Party) చేరుతారా లేదా టీడీపీలో (TDP) చేరుతారా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ (YSRCP) మాజీ సలహాదారు ఎస్. రాజీవ్ కృష్ణ టీడీపీలో (TDP) చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీలో (TDP) చేరారు. టీడీపీకి (TDP) కొత్తగా చేరిన వారిని మంత్రి నారా లోకేష్ పసుపు కండువా కప్పి ఆహ్వానించారు.
రాజీవ్ కృష్ణ రాజకీయంగా మంచి పట్టును కలిగి ఉన్న వ్యక్తి, ఆయన చేరికతో టీడీపీకి (TDP) మరింత బలం లభించింది. ఈ రాజకీయ పరిణామంతో, రాజీవ్ కృష్ణ పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే 11 మంది వైసీపీ (YSRCP) కౌన్సిలర్లు రాజీనామా చేశారు.