HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cm Chandra Babu Meeting With Bill Gates In Delhi Tomorrow Whats The Gates Foundation Going To Do In Ap

Gates Foundation: రేపు బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. జరగబోయే ఒప్పందాలివే

విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని గేట్స్ ఫౌండేషన్(Gates Foundation) ప్రోత్సహించనుంది.

  • By Pasha Published Date - 11:10 AM, Tue - 18 March 25
  • daily-hunt
Cm Chandra Babu Ap Cm Bill Gates Delhi Gates Foundation Ap

Gates Foundation: రేపు (బుధవారం) ఢిల్లీ వేదికగా మైక్రోసాఫ్ట్ అధినేత, అపర కుబేరుడు బిల్‌‌గేట్స్‌‌తో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.  ఈసందర్భంగా ఐదు కీలక రంగాలకు సంబంధించి బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌‌తో ఏపీ సర్కారు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య రంగం, విద్యారంగం, పరిపాలనా విభాగం, వ్యవసాయ రంగం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారాన్ని అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ సాంకేతిక సహకారాన్ని ఫౌండేషన్‌ అందిస్తుంది.

Also Read :Indian Breads : టాప్-50 బ్రెడ్లలో 8 మన దేశానివే.. నంబర్ 1 మనదే

ఆరోగ్య సేవల రంగంలో..

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) పథకం ఏపీలో అమలవుతోంది. త్వరలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో  రాష్ట్రంలో డిజిటల్‌ హెల్త్‌ కమాండ్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా కేంద్రీకృత, సమీకృత కృత్రిమమేధ(ఏఐ) ఆధారిత చికిత్సలను అందిస్తారు. ప్రజల వ్యక్తిగత ఆరోగ్య చరిత్రలను రూపొందిస్తారు. ఈవివరాలను గేట్స్‌ ఫౌండేషన్‌ ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌తో గేట్స్ ఫౌండేషన్ చేతులు కలపనుంది. తద్వారా టెలీ మెడిసిన్‌ వేదికలను మరింత సమర్థవంతంగా అందించనుంది.

విద్యారంగంలో..

విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని గేట్స్ ఫౌండేషన్(Gates Foundation) ప్రోత్సహించనుంది. ఇందుకు అవసరమైన విధానాలను, బోధనాంశాలను, సాంకేతిక వసతులను సమకూర్చనుంది. దీనివల్ల దీర్ఘకాలలో ఏపీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

పరిపాలనా విభాగంలో.. 

ఏపీలో డేటా లేక్‌ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సాయాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ అందించనుంది. ప్రభుత్వ పాలనా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు చేదోడును అందించనుంది.

వ్యవసాయ రంగంలో.. 

వ్యవసాయ రంగంలో డిజిటల్‌ టెక్నాలజీని ఎలా వాడాలి ? ఏఐ టెక్నాలజీతో రైతులు ఎలా లబ్ధి పొందాలి ? అనే అంశాలపై ఏపీ రైతులకు అవగాహన కల్పించేందుకు గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలను అందించనుంది.  ఇందుకు అవసరమైన సాంకేతిక సామగ్రిని కూడా అందిస్తుంది. పంట దిగుబడులు పెంచుకునేందుకు అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులను సైతం నేర్పుతుంది. ఏపీ స్పేస్ అప్లికేషన్స్ శాటిలైట్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు గేట్స్ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా రైతులు వ్యవసాయ రంగంలో వికాసం కోసం శాటిలైట్ టెక్నాలజీని నేరుగా వాడుకోవచ్చు.

ఉద్యోగ కల్పనలో..

ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలను అందిస్తుంది. ఏఐ టెక్నాలజీని యువతకు చేరువ చేసే దిశగా ఏపీ సర్కారు చేసే ప్రయత్నాలకు సాంకేతిక చేదోడును అందిస్తుంది.

Also Read :Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP CM
  • bill gates
  • CM Chandra babu
  • delhi
  • Gates Foundation

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd