HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cid Registers Case Against Posani Krishna Murali In Ap

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి పై ఏపీ సీఐడీ కేసు నమోదు!

సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా పోసాని మాట్లాడాడని బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలుచోట్ల పోసాని పై ఫిర్యాదులు వచ్చాయి.

  • Author : Kode Mohan Sai Date : 18-11-2024 - 4:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Posani Krishna Murali
Posani Krishna Murali

Posani Krishna Murali: సినీనటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా, పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కీసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదును బట్టి, ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు.

సెప్టెంబర్ నెలలో జరిగిన ఓ మీడియా సమావేశంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచిన పోసాని పై కేసు:

వంశీకృష్ణ, పోసాని కృష్ణ మురళి తన వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచారన్న ఆరోపణ చేశారు. ఆయన మాటలు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడతాయినీ, సమాజంలో ఉద్రిక్తతలను పెంచేలా ఉండాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా, సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్లు కింద పోసాని పై చర్యలు తీసుకోవడానికి సీఐడీ కేసు నమోదు చేసింది.

పోసాని పై మరో కేసు:

మరోవైపు, పోసాని కృష్ణ మురళి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఇప్పటికే అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.

పోసాని పై మరిన్ని ఫిర్యాదులు:

అలాగే, రాజంపేట పోలీస్ స్టేషన్‌కు కూడా పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు అందింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి. పోసానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అంతేకాక, అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదులు వచ్చాయి.

మరోవైపు, సినీ నటి శ్రీరెడ్డి కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సోషల్ మీడియా ఖాతాల ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనితల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై కూడా కూటమి శ్రేణులు వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap police
  • br naidu
  • CM Chandrababu
  • nara lokesh
  • Pawan Kalyan
  • Posani Krishna Murali
  • Posani Krishna Murali Arrest

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Olx Scam

    OLX Scam: మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

  • Manoj Babu

    Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd