Chiranjeevi – Janasena : జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం.. విశ్వంభర షూటింగ్ సెట్‌లో..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి జనసేనకు విరాళం ఇచ్చారు.
- Author : News Desk
Date : 08-04-2024 - 5:41 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi – Janasena : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్ధికంగా మాత్రం జనసేన అంతంతమాత్రమే. చాలా వరకు జనసేన విరాళాల మీదే ఆధారపడుతుంది. పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. ఇప్పటికే పవన్ తల్లి, నాగబాబు, వరుణ్ తేజ్.. ఇలా పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లకి తోచినంత విరాళం ఇచ్చారు.
ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి జనసేనకు విరాళం ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర(Vishwambhara) షూటింగ్ లో ఉన్నారు. హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల్ దగ్గర వేసిన సెట్స్ లో విశ్వంభర షూటింగ్ జరుగుతుంది. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్, నాగబాబు(Nagababu) చిరంజీవి పిలుపు మేర విశ్వంభర సెట్స్ వద్దకు వెళ్లారు. పవన్ చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం చిరంజీవి ఐదుకోట్ల రూపాయల్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్ కి అందించారు. అనంతరం సెట్ లోనే కూర్చొని ఈ ముగ్గురు అన్నదమ్ములు కాసేపు మాట్లాడుకున్నారు. పలువురు జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాటలు టీవీ ద్వారా విన్న చిరంజీవి తన తమ్ముడికి ఆశీర్వాదాలతో పాటు ఆర్ధిక బలం కూడా ఉండాలని తన వంతుగా చిరంజీవి అయిదు కోట్ల రూపాయలను అందించినట్లు జనసేన పార్టీ అధికారికంగా కూడా ప్రకటించింది. అలాగే రామ్ చరణ్ కూడా త్వరలోనే జనసేన పార్టీకి విరాళం ఇస్తాడని సమాచారం.

ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలవడం, చిరు, పవన్, నాగబాబు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వగా అభిమానులు సంతోషిస్తున్నారు. చిరంజీవి డైరెక్ట్ గా మొదటిసారి జనసేనకు విరాళం ఇవ్వడంతో రాజకీయంగా కూడా చర్చగా మారింది.
జనసేనానికి శ్రీ చిరంజీవి గారి ఆశీర్వాదాలు… జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం @KChiruTweets @PawanKalyan pic.twitter.com/4DZ9XLJ9aT
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2024
Also Read : AP : జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు – వైస్ షర్మిల