HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cheap Political Strategies Of Parties In Andhra Pradesh

AP Politics : ఏపీ `డ‌ర్టీ` పాలి`ట్రిక్స్`

ఏపీ రాజ‌కీయం ఛండాలంగా మారింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధంలేని మ‌హిళ‌ల్ని బ‌జారు కీడ్చే `డ‌ర్టీ` పాలిటిక్స్ కు వేదిక‌గా మారింది.

  • Author : Hashtag U Date : 28-09-2022 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Posters
Ap Posters

ఏపీ రాజ‌కీయం ఛండాలంగా మారింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధంలేని మ‌హిళ‌ల్ని బ‌జారు కీడ్చే `డ‌ర్టీ` పాలిటిక్స్ కు వేదిక‌గా మారింది. గాసిప్స్, వ్య‌క్తిత్వ హ‌న‌నం, నిరాధార ఆరోప‌ణ‌లు, అశ్లీల పోస్ట‌ర్ల‌తో ఏపీ రాజ‌కీయం నిండిపోయింది. ఒక‌ప్పుడు స‌గ‌ర్వంగా పిలుచుకునే అన్న‌పూర్ణ‌లాంటి ఏపీ ప‌రువు కృష్ణా, గోదాట్లో క‌లిసిపోతోంది. ఎనిమిదేళ్ల క్రితం జ‌నసేన సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రారంభ‌మైన బూతు, అశ్లీల సాహిత్యం 2019 ఎన్నిక‌ల నాటికి వైసీపీ, టీడీపీ ప‌తాక‌స్థాయికి చేర్చాయి. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ మ‌ధ్య న‌డుస్తోన్న రాజ‌కీయ యుద్ధం ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పే, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి పే అంటూ పోస్ట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న వ‌ర‌కు దిగ‌జారింది.

ఏపీ, తెలంగాణాల్లోని ప్ర‌ధాన మీడియా `పింక్, ఎల్లో, బ్లూ, బ్లాక్` విభాగాలుగా మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న మీడియాకు పింక్, వైసీపీ సొంత మీడియాకు బ్లూ, టీడీపీ సానుభూతి మీడియాకు ఎల్లో, సమాజాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ పీక్కుతినే మీడియాకు చీక‌టి( బ్లాక్‌) మీడియాగా ప్రాచుర్యం ఉంది. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా ఆధిపత్యం తెలుగు రాష్ట్రాల్లో బాగా క‌నిపిస్తోంది. అందుకే, సోష‌ల్ మీడియా వేదిక‌ల‌ను ఆయా రాజ‌కీయ పార్టీలు ఇప్పుడు సొంతం చేసుకుంటున్నాయి. వాటి నిర్వాహ‌కులుగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను పెట్టుకుంటున్నారు. దీంతో ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు బ‌దులుగా ప్రైవేటు వ్య‌వ‌హారాలు, ఇళ్ల‌లోని మ‌హిళ‌ల్ని టార్గెట్ చేసి న్యూస్ ను వండివార్చుతున్నారు. గౌర‌వంగా ఇళ్ల‌లో ఉండే మ‌హిళ‌లపై పోస్టుల‌ను క్రియేట్ చేస్తూ వాళ్ల భ‌ర్త‌ల్ని బ‌జారుకీడ్చ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లోని స‌రికొత్త ట్రెండ్ గా క‌నిపిస్తోంది.

ప్ర‌ధాన మీడియా, సోష‌ల్ మీడియాను దాటుకుని ఇప్పుడు పోస్టర్ల వ‌ర‌కు బూతు, అశ్లీల రాజ‌కీయం చేరింది. గోడ‌లు, హోర్డింగ్ లపై పోస్ట‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌త్య‌ర్థి పార్టీల అధిప‌తుల‌ను మానసిక ఆందోళ‌న‌కు గురిచేసే రాజ‌కీయం వ‌చ్చేసింది. రెండు రోజులుగా వైఎస్ భార‌తి, నారా బ్ర‌హ్మ‌ణి ఫోటోల‌తో ఉన్న పోస్ట‌ర్లు ఏపీలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో భార‌తి ఉన్నార‌ని తొలి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. ఆ మేర‌కు ఆ పార్టీ సానుభూతి మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌గా డామేజ్ చేస్తూ ప్ర‌చారం చేసింది. తాజాగా `భార‌తి పే` లిక్క‌ర్ మ‌నీ యాక్స‌ప్టెడ్ హియ‌ర్ అంటూ టైటిల్ తో ఒక క్యూ ఆర్ కోడ్ ను చిత్రీక‌రించి గోడ‌ల‌పై ప్ర‌ద‌ర్శించిన‌ పోస్ట‌ర్ ఏపీలో క‌ల‌క‌లం సృష్టించింది. ప్ర‌తిగా బ్ర‌హ్మ‌ణి పే- తాజ్ హోట‌ల్ బిల్స్ యాక్స‌ప్టెడ్ హియ‌ర్ అంటూ ఒక క్యూ ఆర్ కోడ్ బ్ర‌హ్మ‌ణి ఫోటోతో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ నాలుగు పెళ్లిళ్లు వ్య‌వ‌హారంతో ప్రారంభ‌మై శ్రీరెడ్డి, క‌త్తి మ‌హేష్ వ‌ర్సెస్ జ‌న‌సేన యుద్ధం అప్ప‌ట్లో న‌డిచింది. ఆ స‌మ‌యంలో అశ్లీల ప‌ద‌జాలం విస్తృతంగా న‌డిచింది. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేసిన అంశాన్ని అప్ప‌ట్లో చూశాం. అదే ఒర‌వ‌డిని జన‌సేన కొన‌సాగిస్తోంది. ఆ పార్టీని త‌ల‌ద‌న్నే విధంగా 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ, టీడీపీ ప‌ర‌స్ప‌రం గాసిప్స్ తో హోరెత్తించాయి. ప్ర‌భాస్-ష‌ర్మిల‌, కోటి- లక్ష్మీపార్వ‌తి, రాహుల్‌-బ్ర‌హ్మ‌ణి ఇలా ఎన్నో అంశాల‌ను సోష‌ల్ మీడియా కూడా సిగ్గుప‌డేలా పోస్టులు పెట్టారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి ఏ మాత్రం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు సంబంధంలేని భార‌తి, బ్ర‌హ్మ‌ణి పోస్ట‌ర్ల‌ను అశ్లీలంగా ప్ర‌ద‌ర్శిస్తూ వైసీపీ, టీడీపీ `సోష‌ల్ యోధులు` ప‌ర‌స్పరం ఏపీ ప‌రువును బ‌జారుకీడ్చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • itdp
  • social media
  • telugu desam party
  • ysrcp

Related News

Eluru Police Counseled A 15

Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకు ప్రవర్తనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్ ఆడుతూ, పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని డ

  • Veteran leader Satyanarayana met Chandrababu.

    చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

Latest News

  • Mahender Makhijani: అమెరికాలో బ్యాంకు మోసం ఏకంగా రూ. 950 కోట్లు.. భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

  • ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం

  • AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి అరెస్ట్​

  • ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

  • Mamata Banerjee: దీదీ కి భారీ షాక్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd