HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababus Government Takes Key Decision Bhogapuram International Airport To Get A New Name

Bhogapuram Airport: చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు పేరు ఫిక్స్..

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది.

  • By Kode Mohan Sai Published Date - 11:29 AM, Fri - 22 November 24
  • daily-hunt
Bhogapuram Airport
Bhogapuram Airport

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు నిర్ణయించారు. శాసనసభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రముఖ ఉద్యమకారుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రపోజల్‌ను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పెట్టగా, శాసనసభ ఆమోదం తెలిపింది.

ఇక, అల్లూరి సీతారామరాజు స్మారకార్థం ఒక మ్యూజియం కూడా విమానాశ్రయం పక్కన ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్లమెంటులో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టాలని భావించామని.. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో పెడతామని.. అవసరమైతే తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం పోరాడి, ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారన్నారు సీఎం చంద్రబాబు. రాజవొమ్మంగి, చింతగొంది, కృష్ణదేవి పేట పోలీసు స్టేషన్లపై దాడి చేసి, బ్రిటిష్ హకిములకు భయాన్ని పుట్టించారు అని ఆయన వివరించారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం గుర్తు చేస్తూ, దేశం కోసం చేసిన వీర పోరాటాలను స్మరించుకోవాలన్నారు.

ఈ సందర్భంగా, అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని వెల్లడించారు. అలాగే, అల్లూరి సీతారామరాజు స్మారకంగా భోగాపురం ఎయిర్‌పోర్టులో స్మారక మ్యూజియాన్ని నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో లోకాయుక్త సవరణ బిల్లు, ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రివెన్షన్‌ బిల్లు, మున్సిపల్ లా బిల్లు, వస్తు, సేవల సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లు, ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు, హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, మరియు మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు.

అలాగే, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతానని సంబంధిత తీర్మానాలను కూడా సభ ఆమోదించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alluri Sitha RamaRaju Airport
  • ap assembly
  • AP government
  • Bhogapuram Airport
  • CM Chandrababu

Related News

New Districts In Ap

New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

New Districts in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి

    Latest News

    • JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!

    • Dengue Vaccine : ప్రపంచంలోనే ఫస్ట్ సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ సిద్ధం

    • Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!

    • Rahul Sipligunj : ఓ ఇంటివాడైన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

    • Telangana Grama Panchayat Elections : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd