CBN New House : కొత్త ఇంటికి చంద్రబాబు భూమి పూజ..ఇల్లు విశేషాలు ఇవే
CBN New House : ఈ కొత్త ఇల్లు 2500 గజాల్లో నిర్మించనున్నారు. ఇందులో కార్యాలయం, నివాస భవనం, కారు పార్కింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు
- Author : Sudheer
Date : 08-04-2025 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravathi)లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నివాస నిర్మాణానికి శంకుస్థాపన (Foundation stone laying) ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 9 బుధవారం ఉదయం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. వెలగపూడి(Velagapudi) లోని సచివాలయం వెనుక ఉన్న 9 రహదారి సమీపంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. రాజధాని అమరావతిలో తన నివాసాన్ని నిర్మించడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
IPL 2025 -Thrilling Match: KKRపై LSG విజయం
ఈ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఐదు ఎకరాల భూమిని ఇటీవల చంద్రబాబు కొనుగోలు చేశారు. భూమి పూజ సందర్భంగా గ్రామస్థులు ముఖ్యమంత్రి కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించారు. రాజధాని ఉద్యమ సమయంలో నారా భువనేశ్వరి రైతులకు ధైర్యం చెప్పిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన త్యాగాలను కొనియాడారు. తమ గ్రామం తరఫున కృతజ్ఞతగా ఈ గౌరవాన్ని అందజేస్తామని వారు తెలిపారు.
ఈ కొత్త ఇల్లు 2500 గజాల్లో నిర్మించనున్నారు. ఇందులో కార్యాలయం, నివాస భవనం, కారు పార్కింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భువనేశ్వరి ఈ నిర్మాణ స్థలాన్ని పరిశీలించినట్టు సమాచారం. గతంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇంటి నిర్మాణం చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు చంద్రబాబు ఇంటి నిర్మాణం అమరావతికి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. 2024లో జరిగిన ఎన్నికల తర్వాత తిరిగి ప్రారంభమైన రాజధాని అభివృద్ధిలో ఈ కొత్త ఇల్లు ఒక సంకేతంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.