IPL 2025 -Thrilling Match: KKRపై LSG విజయం
Thrilling Match: KKR 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది
- By Sudheer Published Date - 07:51 PM, Tue - 8 April 25

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక(Eden Gardens )గా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో (LSG) విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన LSG జట్టు ఏకంగా 238 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (81 పరుగులు) తన శైలిలో చెలరేగగా ఆడగా, తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (86 పరుగులు) సిక్స్‌ల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు బాది కోల్‌కతా బౌలర్లను పరుగులు పెట్టించాడు. దీంతో LSG నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు చేసింది.
Samsung : కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్
దీంతో 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు కూడా ఆదిలోనే పుంజుకుంది. డికాక్ త్వరగా వెనుదిరిగినా, నరైన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వన్‌డౌన్‌గా వచ్చిన రహానే అర్ధశతకం చేసి మెరిశాడు. అతనికి వెంకటేష్ అయ్యర్ చక్కటి భాగస్వామ్యం అందించాడు. ఒక దశలో మ్యాచ్ పూర్తిగా కోల్‌కతా వైపు తిరిగినట్లు అనిపించింది. కానీ 14వ ఓవర్ల తర్వాత లఖ్‌నవూ బౌలర్లు మళ్లీ మెరిశారు. వరుస వికెట్లతో KKR జట్టును ఒత్తిడికి గురిచేశారు.
JBL : ట్యూన్ సిరీస్ 2 ను లాంచ్ చేసిన జెబిఎల్
చివరి ఓవర్లలో రింకూ సింగ్ మరోసారి మ్యాజిక్ చేస్తాడా? అనే ఉత్కంఠకు తెరపడింది. అతను ప్రయత్నించినా, విజయం మాత్రం అందుకోలేకపోయాడు. చివరికి KKR 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. పరుగుల పండుగగా సాగిన ఈ మ్యాచ్‌లో LSG ఘన విజయం సాధించింది.