TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
- Author : Latha Suma
Date : 04-06-2024 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, వైసీపీ గెలుస్తుందని తొమ్మిదో తేదిన విశాఖలో జగన్ ప్రమణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని.. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు.
Read Also: Tamilisai : మాజీ గవర్నర్ తమిళిసై వెనుకంజ.. చెన్నై సౌత్‌లో చేదు ఫలితం
మరోవైపు ప్రధాని నరేంద్రమోడి చంద్రబాబుకు ఫోన్ చేశారు. తెలుగు దేశం పార్టీ కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపిన మోడీ…ఏపీని అభివృద్ధి చేయాలని కోరారట. కాగా… టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం.ఎన్డీయేను 300 సీట్లు దాటనివ్వకుండా శాయశక్తులా కృషి చేస్తున్న ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగానే చంద్రబాబును వేణుగోపాల్ కలవనున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.