Tamilisai : మాజీ గవర్నర్ తమిళిసై వెనుకంజ.. చెన్నై సౌత్‌లో చేదు ఫలితం
తెలంగాణ గవర్నర్ పదవిని వదిలిపెట్టి మరీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేశారు.
- By Pasha Published Date - 01:12 PM, Tue - 4 June 24

Tamilisai : తెలంగాణ గవర్నర్ పదవిని వదిలిపెట్టి మరీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేశారు. ఆమె చెన్నై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమెకు ఆశాజనక ఫలితం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆమె వెనుకంజలో ఉన్నారు. డీఎంకే సిట్టింగ్ ఎంపీ తమిజాచి తంగపాండియన్, తమిళిసై కంటే దాదాపు 17వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు చెన్నై ఉత్తర, సెంట్రల్ చెన్నై నియోజకవర్గాలలో డీఎంకే అభ్యర్థులు కళానిధి వీరాస్వామి, దయానిధి మారన్‌లు ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిశాక ముగ్గురు డీఎంకే అభ్యర్థులు కూడా లీడ్‌లో దూసుకుపోతున్నారు. చెన్నై సౌత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ (Tamilisai), చెన్నై సెంట్రల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి వినోజ్ సెల్వం రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఏఐఏడీఎంకే, దాని మిత్రపక్షం డీఎండీకే ఈ రెండు లోక్‌సభ స్థానాల్లోనూ మూడో ప్లేసులో కొనసాగుతున్నాయి. చెన్నై నార్త్ బీజేపీ అభ్యర్థి ఆర్సీ పాల్ కనగరాజ్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join