HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Supports For Minoritys Full Details Inside

Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!

Chandrababu Naidu: తెలుగుదేశంపై అపవాదులు వేయడంలో వైసీపీ 2019 ఎన్నికల్లో పైచేయి సాధించింది. చేయని తప్పులను కూడా అపాదించింది. అలాంటి వాటిలో ఒకటి ముస్లిం రిజర్వేషన్లు. వాస్తవంగా మైనారిటీలకు వైఎస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

  • Author : CS Rao Date : 11-12-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

Chandrababu Naidu: తెలుగుదేశంపై అపవాదులు వేయడంలో వైసీపీ 2019 ఎన్నికల్లో పైచేయి సాధించింది. చేయని తప్పులను కూడా అపాదించింది. అలాంటి వాటిలో ఒకటి ముస్లిం రిజర్వేషన్లు. వాస్తవంగా మైనారిటీలకు వైఎస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. వాటిపై టీడీపీనే హైకోర్టులో వ్యాజ్యం వేసి, దీనిని కొట్టేసేలా చేసిందనే ధుష్ప్రచారాన్ని వైసీపీ టీడీపీపై బాగా రుద్దింది. నిజానికి ఆ వ్యాజ్యం వేసింది టీడీపీ కాదు అయినా ఆరోపణలపై కౌంటర్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో ఇది మైనస్ అయ్యింది.

అందుకే అప్పటి నుంచి ఆ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్ వైపు మళ్లింది. అయితే చంద్రబాబు హయాంలో కొన్ని పథకాలను ప్రవేశ పెట్టారు. దుల్హన్ ,హజ్ యాత్రకు నిధులు వంటివి ఇచ్చారు. అయితే అవి సరైన ప్రచారం లేక టీడీపీ కి మైలేజీ తెచ్చిపెట్టలేక పోయాయి.బలమైన నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటు బ్యాంకును కైవసం చేసుకునే వ్యూహాత్మక నాయకులకు చోటు ఇవ్వకపోవడం మైనస్గా మారిపోయింది. ముందుగా మైనారిటీల ఓట్లను ఎలా తమవైపు తిప్పుకోవాలనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టి ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు.

చంద్రబాబు తాజాగా మైనారిటీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం అయితే చేశారు. కానీ చంద్రబాబు హవా జోరుగా ఉన్న 2014 ఎన్నికల్లోనే ఆ పార్టీకి ఒక్క మైనారిటీ సీటు కూడా దక్కలేదు. అప్పట్లోనే మైనారిటీ శాఖను ఏర్పాటు చేయలేక పోయారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జలీల్ ఖాన్ను తీసుకుని మైనారిటీ శాఖను అప్పగించాలని చూసినా కలిసి రాలేదు. ఇక ఇప్పుడు ఈ మూడున్నరేళ్ల కాలంలో పార్టీ పరంగా చూసుకున్నా మైనారిటీలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పార్టీప రంగా వారికి ప్రాధాన్యం కల్పించి ఉన్నా మైనారిటీలో విశ్వాసం పెరిగి ఉండేది. అయితే మైనారిటీలకు తాము 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీలు టీడీపీ వైపు చూసేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ వేసిన అపవాదులు మైనారిటీలో ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • chandrababu
  • Minorities
  • tdp

Related News

amaravati farmers land allotment

రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతినే – చంద్రబాబు

రాజకీయాల్లో పెరిగిపోతున్న అనైతికతపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి లేని రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు మరియు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ధోరణులు పెరిగాయని, వీటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు

  • Ntr Wishes To Lokesh

    Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!

  • Cbn Lands

    మరోసారి అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్న చంద్రన్న

  • Vijayasai Reddy Attends To ED Investigation

    ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి

  • Lokesh Davos

    వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్

Latest News

  • సింగరేణి బొగ్గు గనిలోకి దిగిన కిషన్ రెడ్డి

  • తమ హయాంలో మహేశ్ గౌడకు కీలక పదవి ఇస్తా – కవిత కీలక ప్రకటన

  • అల‌స‌ట‌గా ఉంటున్నారా? అయితే ఈ విట‌మిన్ లోపం ఉన్న‌ట్లే?!

  • బిగ్ బాష్ లీగ్.. విజేత ఎవ‌రంటే?!

  • అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?

Trending News

    • ఎస్బీఐ వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌!

    • రాజ‌కీయాల నుంచి క్రీడ‌ల‌ను దూరంగా ఉంచ‌లేం: మాజీ క్రికెటర్

    • ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న కోహ్లీ భార్య‌?!

    • 1955లో బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే విధానాన్నే మార్చేసిన సి.డి. దేశ్‌ముఖ్!

    • ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన మెగాస్టార్ మూవీ.. రేపు సక్సెస్ మీట్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd