Pawan with Chandrababu: చంద్రబాబు, పవన్‌ల ఉమ్మడి రోడ్‌షోకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.
- Author : Praveen Aluthuru
Date : 07-04-2024 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan with Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో, పవన్ వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ ఒంటరిగానే రోడ్ షోలు నిర్వహించారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఉమ్మడిగా రోడ్ షోకు సిద్ధమవుతున్నారు.
కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహాకూటమి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు టీడీపీ, జనసేన నేతలు భారీ రోడ్‌షో ప్లాన్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగిన సమీక్షా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
దాదాపు 75 కిలోమీటర్ల మేర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న ఈ రోడ్ షోకు వివిధ ప్రాంతాల్లో అవసరమైన అనుమతులు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఉండి వరకు రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌లు కలిసి రోడ్‌షోలో పాల్గొంటే భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. రెండు జిల్లాల్లో మహాకూటమి అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలకు పెద్దపీట వేస్తే ఈ తరహా రోడ్ షో నిర్వహించాలని ఇరు పార్టీల నేతలు యోచిస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నాయుడు, పవన్‌ల రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉంది.
Also Read: Samantha : జిమ్‌లో సమంత భారీ కసరత్తులు.. అల్లు అర్జున్ సినిమా కోసమేనా..!