HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Pawan And Sharmila Attended The At Home Programme

Raj Bhavan : ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్‌, షర్మిల

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు రాజకీయ నేతలంతా హాజరయ్యారు.

  • Author : Latha Suma Date : 15-08-2024 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu, Pawan and Sharmila attended the At Home programme
Chandrababu, Pawan and Sharmila attended the At Home programme

Raj Bhavan: ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌ భవన్‌లో నిర్వహించే గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం విజయవాడ (Vijayawada)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు రాజకీయ నేతలంతా హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు కూడా హాజరైన ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారు. రాజ్ భవన్ లో ఈ సాయంత్రం జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. గవర్నర్, ఛీఫ్ జస్టిస్, సీఎస్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన్ను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు నేతలు, అధికారులు పోటీ పడ్డారు. అలాగే వీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కనిపించగానే లోకేష్ ఆమెను పలకరించారు. దీంతో ఆమె కూడా కాసేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన సతీమణి విదేశాల్లో ఉండటంతో ఒంటరిగానే వచ్చారు. గతంలో సీఎంగా ఉండగా ప్రతీ ఏటా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాలకు హాజరైన వైఎస్ జగన్ .. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎట్ హోం కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. తన సోదరి వైఎస్ షర్మిల కూడా హాజరై సీఎం, మంత్రులతో కలివిడిగా కనిపించిన ఈ కార్యక్రమంలో జగన్ లేకపోవడంతో అంతా చర్చించుకున్నారు. అటు జగన్ గైర్హాజరుపై వైసీపీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.

ఆగస్టు 15 సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే సంప్రదాయవిందు ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. పిసిసి ఛీఫ్ షర్మిల ఈ కార్యక్రమానికి రావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే షర్మిల , మంత్రి లోకేష్ లు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకోవటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కూటమికి కాంగ్రెస్ పార్టీ తోకపార్టీలా తయారైందని వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తోన్న తరుణంలో ఈ ఇద్దరు నేతలు దాదాపు 3 నిమిషాల పాటు చర్చించుకోవటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

Read Also: Hero Vida V1 Plus : రూ. 18లో 100కి.మీలు పరిగెత్తుతుంది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా తక్కువే..!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • at home
  • chandrababu
  • Governor
  • Pawan Kalyan
  • raj bhavan

Related News

Nara Lokesh Blackbuck

Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd