HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Offers Prayers At Tirupati Temple Before Assuming Charge

CBN : తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా – సీఎం చంద్రబాబు

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా

  • Author : Sudheer Date : 13-06-2024 - 1:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Tirumala
Babu Tirumala

తిరుమల (Tirumala) నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా.. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా.. అని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు (AP CM Chandrababu). బుధువారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు..నిన్న సాయంత్రం తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన…ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.

అనంతరం ఆయన అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. తమది దేశ చరిత్రలోనే చరిత్రత్మక విజయమని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చామని.. ఈ క్రమంలోనే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని బాబు తెలిపారు. అలాగే గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని..తాను రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు. ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి.. వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. తితిదేను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు అన్నారు.

ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో చంద్రబాబు.. తనదైన మార్క్ చూపించారు. ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కంటిన్యూ చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా.. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించారు. కాగా.. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించి నానా హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ బాబు మాత్రం ఆలా చేయద్దంటూ సూచించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుంది. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు. గత ఐదేళ్లలో తిరుమలను… pic.twitter.com/64HEl8M7Gj

— Telugu Desam Party (@JaiTDP) June 13, 2024

Read Also : Garlic Benefits: వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • tirumala

Related News

bandla ganesh maha padayatra

ఏపీ సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర

Bandla Ganesh Maha Padayatra  ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన స్వస్థలం షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్రపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వృత్తిరీ

  • Do you know the legend behind the glory of Lord Srivari appearing without weapons?

    ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?

  • Minister Vasamsetti Subhash

    భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

  • 2026 Central Budget

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • Don't Want Water Dispute Be

    ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

Latest News

  • నెలాఖరులోగా SLBC పనులు ప్రారంభించాలి – అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్

  • సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్

  • ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేడే చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు. మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త

  • మెగాస్టార్ మన శంకరవరప్రసాద్‌ గారు మూవీ రివ్యూ

  • ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణ పనులు

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd