HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Kuppam Visit Was Tense Police Lathi Charge

Babu@Kuppam: బాబు కుప్పం పర్యటన ఉద్రిక్తం, పోలీసుల లాఠీ ఛార్జ్

చంద్రబాబు పర్యటన వేళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు.

  • Author : CS Rao Date : 24-08-2022 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishna District
chandrababu naidu

చంద్రబాబు పర్యటన వేళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఫలితంగా ఇరుపార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఇందులో బోదుగూరు ఎస్సైకి, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా బుధవారం రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు పర్యటించారు. ఆయన పర్యటించే మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన తోరణాలకు ఆనుకొని వైసీపీ జెండా తోరణాలు కట్టారు. వైసీపీ తోరణాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి డౌన్‌ డౌన్‌ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు డౌన్‌ డౌన్‌ సీఎం అంటూ ముందుకు రాగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో వారికే తెలియదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వైసీపీని ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పింఛన్లు తొలగించలేదన్నారు. గండికోట జలాశయం ద్వారా పులివెందులకు నీళ్లు తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వైసీపీ నేతలకు కుప్పం నియోజకవర్గం అంటే కక్ష అని మండిపడ్డారు. కుప్పంలో చోటామోటా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వానికి కుప్పం అంటే కక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. హంద్రీనీవా ద్వారా వీ.కోట వరకు నీరు తెస్తే కుప్పం వరకు నీరివ్వలేక పోయారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుప్పంలో చోటామోటా నాయకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ‘‘నేనొస్తే ఎక్కడికక్కడ మీ జెండాలు కడతారా?. ఇకనైనా మీ చిల్లర చేష్టలు మానుకోండి. వైసీపీ దొంగలు జాగ్రత్త..నేనొస్తే మీ తోకలు కట్ చేస్తా. పోలీసులు మీ పని మీరు చేసుకోండి. ఎవరిపై పడితే వారిపై తప్పుడు కేసులు పెడతారా?. ఎఫ్ఐఆర్ అంటే మీ జాగీరనుకున్నారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

వైసిపి రౌడీల తోకలు కత్తిరిస్తా – @ncbn#CBNInKuppam#JaganPaniAyipoyindhi pic.twitter.com/yNFFUymusV

— Telugu Desam Party (@JaiTDP) August 24, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • kuppam tense
  • kuppam visit
  • tdp

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd