HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Gets Relief In Ap High Court

Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • Author : Vamsi Chowdary Korata Date : 30-03-2026 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati Inner Ring Road Case
Amaravati Inner Ring Road Case

Chandrababu  ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు అంశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును సీబీఐకి అప్పగించాలని, అలాగే గతంలో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణను ఏసీబీ కోర్టు నుంచి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ మూడు పిటిషన్లు విచారణకు అర్హమైనవి కావని హైకోర్టు తెలిపింది. వాటిని కొట్టివేసింది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని సీఐడీ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు ఈ కేసు విచారణను బదిలీ చేయాలని పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ కోర్టులో వాదించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు రోహత్గీ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న జరిగిన విచారణలో మరోసారి రోహత్గీ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ కేసు దర్యాప్తు పూర్తి చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు ముకుల్ రోహత్గీ. సీఐడీ ఏసీబీ కోర్టులో మిస్టేక్‌ ఆఫ్ ఫ్యాక్ట్‌ కింద ఇప్పటికే తుది నివేదిక దాఖలు చేసిందని గుర్తు చేశారు. అలాగే అసాధారణ సందర్భాల్లో మాత్రమే సీబీఐకి కేసులను అప్పగిస్తారని గుర్తు చేశారు.

అంతేకాదు చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండేళ్ల క్రితం బెయిల్ వచ్చిందని రోహత్గీ తెలిపారు. కోర్టు ముందు రికార్డులు ఉన్నప్పుడు బెయిల్ రద్దు ఎలా సాధ్యమని అన్నారు. అంతేకాకుండా ప్రజా ప్రతినిధుల కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలని కోరే అర్హత పిటిషనర్‌కు లేదన్నారు. మూడు పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. అంతకుముందే పిటిషనర్ తరఫున వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని కొట్టివేసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alla Ramakrishna Reddy
  • Amaravati Inner Ring Road Case
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhrapradesh politics
  • AP high court
  • petition
  • ys jagan
  • YSR Congress Party

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd