CM Chandrababu: జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 05-07-2024 - 3:19 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకై ఢిల్లీ పర్యటన చేపట్టిన చంద్రబాబు వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించారు. కేంద్ర మంత్రి రామస్ అరవాలేతో పాటు ఫిక్కీ ప్రతినిధులతోనూ ఆయన సమావేశం కానున్నారు. అదనంగా, భారతదేశంలోని జపాన్ రాయబారితో సమావేశం అజెండాలో ఉంది.
అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై గత ప్రభుత్వ పాలనా లోపంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు. ఢిల్లీలో సమావేశాల అనంతరం చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
Also Read: CM Chandrababu: నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన చంద్రబాబు