Chandrababu : చంద్రబాబు కు స్వల్ప అస్వస్థత.. డీహైడ్రేషన్ తో ఇబ్బందిపడుతున్న చంద్రబాబు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. గత రెండు
- By Prasad Published Date - 10:55 PM, Tue - 10 October 23

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతతో ఆయన డీహైడ్రేషన్ కు గురైయ్యారు. ఇదే విషయాన్ని ఆయన జైల్లోని వైద్యాధికారులకు తెలిపారు.ఈ రోజు ములాఖత్‌కు వెళ్లిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు ఈ విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబుకు ఏసీ సదుపాయం లేకపోవడంతో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారు. రిమాండ్‌లో ఉన్న మొదటి రెండు రోజులు దోమలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదుల రావడంతో జైలు పరిసరాల్లో దోమల మందు పిచికారీ చేయించారు. ఇప్పడు ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. అయితే దీనిపై జైలు అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఆరోపణలతో గత 30 రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. ఏసీబీ కోర్టులో బాబు బెయిల్ పిటిషన్‌ని కొట్టివేశారు. ఇటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభంకానుంది.
Also Read: Telangana Election Code : పోలీసులకు భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు