HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Interesting Tweet During Prime Minister Visit

AP Tour : ప్రధాని పర్యటన వేళ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్‌

మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.

  • By Latha Suma Published Date - 12:51 PM, Wed - 8 January 25
  • daily-hunt
Chandrababu interesting tweet during Prime Minister visit
Chandrababu interesting tweet during Prime Minister visit

AP Tour : ప్రధాని మోడీ ఈరోజు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయిత మోడీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని చంద్రబాబు అన్నారు.

కాగా, ప్రధాని మోడీ దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తరువాత ఏపీ పునర్విభజన చట్టం మేరకు విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. విశాఖ కేంద్రంగా ఈ జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం అవుతుంది. దీంతో, ఏపీలోని పలు డివిజన్ రైల్వే కార్యాలయాలు ఈ జోన్ పరిధిలో పని చేయను న్నాయి. అయితే, కీలకమైన వాల్తేరు డివిజన్ విషయంలో మాత్రం రైల్వే శాఖ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

జోన్ ప్రధాన కార్యాలయంకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితమివ్వనున్నారు.ఇదే సమయంలో అనకాపల్లి జిల్లాలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, నక్కపల్లి దగ్గర బల్క్‌డ్రగ్‌ పార్క్‌, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 3 రైల్వే లైన్లు, 6 రైల్వే ప్రాజెక్టులు, 10 రోడ్డు నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో క్రిస్‌సిటీ అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ పట్నంలో రూ.149 కోట్ల విలువైన కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకు స్థాపన చేసేందుకు సర్వం సిద్దమైంది.

కాగా, ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ , ఒడిశాలలో రెండు రోజుల పర్యటనపై ట్వీట్‌ చేశారు. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో పాటు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసి భారతీయ దివస్ వేడుకలలో పాల్గొంటున్నానని వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ , తిరుపతి జిల్లాలోని చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగమైన కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటానని నరేంద్ర మోడీ ట్విటర్‌లో వివరించారు.

Read Also: CBN Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు..ఎందుకో..?  

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tour
  • CM Chandrababu
  • New South Coast Railway Zone
  • pm modi
  • Visakha Railway Zone
  • Visakhapatnam

Related News

Harleen Deol Asks PM Modi

Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

  • Investment In Ap

    Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • Hinduja Group

    Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • CM Chandrababu

    CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Latest News

  • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

  • Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Cough: ద‌గ్గుతో ఇబ్బందిప‌డుతున్నారా? అయితే ఈ క‌షాయం ట్రై చేయండి!

  • IND Beat PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియాదే విజయం!

  • Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd