AP : చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ ఫై ఏపీ సర్కార్ వేటు..
ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు సీఎస్ జవహరెడ్డి తెలిపారు.
- By Sudheer Published Date - 07:54 PM, Sat - 30 September 23

చంద్రబాబు పర్సనల్ సెక్రటరీగా పనిచేసి..ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్ (Pendyala Srinivas)పై రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh Government) సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసినట్లు సీఎస్ జవహరెడ్డి తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడంపై వారంలోగా వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మొమో జారీ చేసింది. అయితే శ్రీనివాస్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. శుక్రవారంలోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా శ్రీనివాస్ వెనక్కి రాలేదు. దీంతో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ విధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండ్యాల శ్రీనివాసరావు చంద్రబాబుకు పీఎస్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.
Read Also : Motha Mogiddam : మోత ‘మాములుగా’ మోగలే..