Yuvagalam NavaSakam: వైసీపీ ఆధీనంలో స్వేచ్ఛ కోల్పోయిన ఉత్తరాంధ్ర
టీడీపీ తరుపున నారా లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీలో జోష్ తీసుకొచ్చారు. కాగా నిన్నటితో పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలయ్య హాజరయ్యారు
- Author : Praveen Aluthuru
Date : 21-12-2023 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
Yuvagalam NavaSakam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో రెండు నేలల్లో అక్కడ ఎన్నికల పోరు మొదలవుతుంది. ఈ మేరకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ తరుపున నారా లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీలో జోష్ తీసుకొచ్చారు. కాగా నిన్నటితో పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలయ్య హాజరయ్యారు. సభకు లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక యువగళం ముగింపు సభకు లక్షలాది మంది తెలుగుదేశం-జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు..
చంద్రబాబు మాట్లాడుతూ.. కురుక్షేత్ర పోరులో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. గతంలో ఎన్నో పాదయాత్రలు జరిగినా.. తొలిసారిగా లోకేష్ యాత్రపై పలు రకాలుగా దాడులు చేసి ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. వైసీపీ ఆధీనంలో ఉత్తరాంధ్ర నలుగుతున్నదని చంద్రబాబు వ్యాఖ్యానించాడు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ ఇప్పుడు గంజాయి రాజధానిగా మారిందన్నారు. జగన్ రెడ్డికి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రజల ఆస్తులు కబ్జా చేస్తే కాపాడే వారు లేరని అన్నారు. యువతతో పాటు అన్ని వర్గాలకు తెలుగుదేశం-జనసేన అండగా నిలుస్తుందన్నారు.
వైసీపీ ప్రభుత్వ ఆగడాలను భరించలేక రాష్ట్రానికి తరలి వచ్చిన కంపెనీలన్నీ పారిపోయాయని, జగన్ రుషికొండను కూడా వదల్లేదని చెప్పారు. సీఎం నివాసానికి 500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.
Also Read: ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ