TDP : రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తుందని టీడీపీ అధినేత
- By Prasad Published Date - 08:12 AM, Mon - 1 May 23

జగన్ ప్రభుత్వం పై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణమన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదని.. ఎవరినీ చిన్న మాట అనలేదని చంద్రబాబు తెలిపారు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారని.. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమేన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని.. జరిగిన దానికి క్షమాపణ చెప్పి సీఎం జగన్ తన తప్పు సరిదిద్దుకోవాలని చంద్రబాబు తెలిపారు.