HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Fan Cycleyatra From Kuppam To Rajamundry

I Am With CBN : చంద్ర‌బాబుకు సంఘీభావంగా సైకిల్ యాత్ర‌.. కుప్పం టూ రాజ‌మండ్రికి..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ఆ పార్టీ నేత‌ల‌తో పాటు చంద్ర‌బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు

  • Author : Prasad Date : 20-09-2023 - 8:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ఆ పార్టీ నేత‌ల‌తో పాటు చంద్ర‌బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు త్వ‌ర‌గా బ‌య‌టికి రావాల‌ని యాగాలు, హోమాలు, పూజ‌లు నిర్వ‌హిస్తుండ‌గా మ‌రికొంత‌మంది చంద్ర‌బాబు అభిమానులు దేవాల‌యాలకు పాద‌యాత్ర చేస్తున్నారు. తాజాగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గ‌గానికి చెందిన చంద్ర‌బాబు అభిమాని కుప్పం నుంచి రాజ‌మండ్రికి సైకిల్ యాత్ర చేప‌ట్టారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపేందుకు సైకిల్‌పై రాజ‌మండ్రి వ‌చ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కణంపచర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈనెల 12న కుప్పంలో సైకిల్‌పై బయలుదేరి మంగళవారం సాయంత్రం రాజమండ్రి చేరుకున్నాడు.

బెంగుళూరులోని సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గణపతి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు చిరకాలంగా అభిమాని. సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలుసుకున్న గణపతి చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు 724 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసి రాజమండ్రి వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రిలో ఉంటున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను ఆయన కలిశారు. ఆయన అభిమానాన్ని చూసి ఉద్వేగానికి లోనైన భువనేశ్వరి.. పార్టీ శ్రేణుల మద్దతుతోనే తాము బలంగా ఉన్నామని, తమపై ఇంతటి అభిమానం ఉందన్నారు. తన అభిమానులందరి మద్దతుతో చంద్రబాబు నిర్దోషిగా బయటపడతారని యువకుడికి ఆమె చెప్పారు. కుప్పం ప్రజలు తమపై చూపుతున్న అభిమానాన్ని చంద్ర‌బాబు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని నారా బ్రాహ్మ‌ణి అన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbn
  • chandrababu
  • I am with CBN
  • kuppam
  • Rajamundhry
  • tdp
  • TDP fan
  • ysrcp
  • YSRCP and TDP

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd