Chandrababu : శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
- By Latha Suma Published Date - 04:28 PM, Mon - 22 April 24

Chandrababu:శ్రీశైలం(Srisailam) శ్రీభ్రమరాంబ మల్లికార్ఖునస్వామి అమ్మవారిని టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu), భువనేశ్వరి(Bhuvaneshwari) దంపతులు దర్శించుకున్నారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పర్యటనలో చంద్రబాబు, భువనేశ్వరి ఇక్కడి సాక్షి గణపతి, వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు రాకతో శ్రీశైలం టీడీపీ శ్రేణుల్లో కోలాహలం ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల ప్రసాదం, శేష వస్త్రాలు, స్వామిఅమ్మవారి చిత్రపటాన్ని కూడా అంద చేశారు. స్వామి వారి దర్శనం చేసుకున్న చంద్రబాబు దంపతులు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.
Read Also: AP : ఏపిలో వేసవి సెలవుల పై విద్యాశాఖ కీలక ఆదేశాలు
కాగా, ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి సున్నిపెంట హెలిపాడ్ కు చేరుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో చంద్రబాబు దంపతులు శ్రీ సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు.