Modi Call to Sharmila: షర్మిల కు మోడీ ఫోన్.. ఢిల్లీకి పిలుపు!
ప్రధాని నరేంద్ర మోడీ వైఎస్. షర్మిలకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.
- Author : Balu J
Date : 06-12-2022 - 12:36 IST
Published By : Hashtagu Telugu Desk
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పది నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. ఆమె పాదయాత్రలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి గురించి, కారులో ఉండగానే పోలీసులు ఆమె వాహనాన్ని లాక్కెళ్లడంపై ప్రధాని మోదీ షర్మిలను ప్రశ్నించారని వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ధైర్యంగా ఉండాలని కోరడంతో పాటు షర్మిలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం.
తన భద్రత పట్ల మోడీ అడిగి తెలుసుకున్నందుకుగానూ ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. (YS Sharmila), ఢిల్లీ పర్యటనకు వస్తానని ప్రకటించారు. ఇప్పుడు వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ (PM Modi) పిలుపు ఇవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే షర్మిల అరెస్ట్ పై గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించడం కూడా రాజకీయంగా మరింత ఆసక్తిని రేపింది. తాజాగా షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి 10 నిమిషాల పాటు మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలపై షర్మిలను మోదీ అడిగి తెలుసుకున్నారని సమాచారం. అయితే ఈ విషయమై షర్మిల మీడియా ముందుకొచ్చి చెబితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయి.
Aslo Read: Modi React on Sharmila issue: షర్మిల ఇష్యూపై ‘మోడీ’ రియాక్షన్.. జగన్ సైలంట్!