Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుతో వార్డు మెంబర్ గుండెపోటుతో మృతి
చంద్రబాబు అరెస్ట్ విషాదాన్ని నింపింది. ఆయన అరెస్టుని జీర్ణించుకోలేని టీడీపీ వర్డ్ మెంబర్ గుండెపోటుతో మృతి చెందాడు. గుత్తి మండలం ధర్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది
- By Praveen Aluthuru Published Date - 04:37 PM, Sat - 9 September 23
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ విషాదాన్ని నింపింది. ఆయన అరెస్టుని జీర్ణించుకోలేని టీడీపీ వార్డు మెంబర్ గుండెపోటుతో మృతి చెందాడు. గుత్తి మండలం ధర్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు వార్తలను చూస్తున్న వడ్డే ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రబాబు అరెస్టుని తట్టుకోలేక ఆయన మద్దతు దారులు షాక్ కి గురవుతున్నారు. కేవలం అధికార పార్టీ కావాలనే అరెస్టులు చేయిస్తుందంటూ మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర బంద్ కి కూడా సన్నాహాలు చేస్తున్నారు. బాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతోంది.
Also Read: Chandrababu Arrest : దుర్గమ్మ సన్నిధానంలో కన్నీరు పెట్టుకున్న నారా భువనేశ్వరి