HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu And Lokesh In Tdp Formation Day Celebrations

TDP : 42వ వసంతంలోకి టీడీపీ..పార్టీ శ్రేణులకు చంద్రబాబు శుభాకాంక్షలు

  • Author : Latha Suma Date : 29-03-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
chandrababu-and-lokesh-in-tdp-formation-day-celebrations
chandrababu-and-lokesh-in-tdp-formation-day-celebrations

TDP Formation Day Celebrations: తెలుగుదేశం పార్టీ(TDP) నేడు 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగు జాతి కీర్తి పతాకాల్ని- తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరేసిన ఈ పార్టీ, ‘తెలుగు దేశం పిలుస్తోంది, రా కదలిరా’ అంటూ అన్న నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Rama Rao) పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షోభాలకు కేంద్ర బిందువుగా నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగిస్తోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యే, ప్రజలతోనే మమేకమవటం తెలుగుదేశం పంథా. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి నవ్యాంధ్రలో తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగా తెలుగుదేశం పావులు కదుపుతోంది.

Read Also: Tollywood: మరోసారి భార్యతో కలిసి సమ్మర్ వెకేషన్ కు రెడీ అయిన చిరంజీవి?

తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని ఆయన కొనియాడారు.

"నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ" అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత అన్నీ సంచలనాలే. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుగార్ల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల జీవనాడిగా రూపుదిద్దుకుంది.… pic.twitter.com/QNTjwbdlG1

— Telugu Desam Party (@JaiTDP) March 29, 2024

బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో పార్టీ నిమగ్నమై ఉందని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరిలో పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన అధినేత చంద్రబాబు నాయుడు గారు.#42ndTDPFoundationDay#TDPFoundationDay#NaraChandrababuNaidu #TeluguDesamParty pic.twitter.com/zauYrmfals

— Telugu Desam Party (@JaiTDP) March 29, 2024

తెలుగు ప్రజ‌ల ఆత్మగౌర‌వం కోసం పుట్టింది తెలుగుదేశమని లోకేశ్ స్పష్టం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచింది ప‌సుపు జెండా అని పేర్కొన్నారు. స‌మాజ‌మే దేవాల‌యం- ప్రజ‌లే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశ‌య‌ సాధ‌న‌, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని లోకేశ్ కొనియాడారు.

Read Also: Anupama Parameswaran: నా తమ్ముడిని బామ్మర్ది అంటూ మెసేజ్ లు చేస్తున్నారు: అనుపమ

ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి నారా భువనేశ్వరి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిజం గెలవాలి టీమ్ ఆధ్వర్యంలో ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నాను#42ndTDPFoundationDay pic.twitter.com/VDn371CrgJ

— Nara Bhuvaneswari (@ManagingTrustee) March 29, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • formation day celebrations
  • Lokesh
  • tdp

Related News

Nagababu

Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

Nagababu : ఐదు, ఆరు ఏళ్ల తర్వాత రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, తన దృష్టిలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

  • Fiber Net Case Against Cm C

    AP Fibernet Case : చంద్రబాబు కు ఆ దిగులు అవసరం లేదు !!

  • Tamil Nadu

    Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి

  • Chandrababu Naidu Lays Foun

    Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Latest News

  • చలికాలంలో కారు హీటర్, ఏసీ.. సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?

  • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

  • తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

  • గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. అతనికి దక్కేది రూ. 18 కోట్లే!

  • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

Trending News

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd