Anupama Parameswaran: నా తమ్ముడిని బామ్మర్ది అంటూ మెసేజ్ లు చేస్తున్నారు: అనుపమ
- By Sailaja Reddy Published Date - 12:25 PM, Fri - 29 March 24
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుపమకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె అందం ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం మళ్ళీ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
కాగా గత ఏడాది కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ ఈ రెండు సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ఇటీవల అనుపమ, హీరో సిద్దూ జొన్నలగడ్డ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఈ నెల 29 న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో అనుపమ అందాల ఆరబోత డీజేటిల్లు నేహా శెట్టి ని మించిపోయింది. ఇది ఇలా ఉంటే నేడు ఈ సినిమా విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందు ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా అందరు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ అనుపమ పరేశ్వరన్ కు మాత్రం ఆరాధకులు.. భక్తులు ఉంటారు. అందుకే టిల్లు స్క్వేర్‌లో అనుపమ హద్దులు దాటే యాక్టింగ్‌ను చేసిందనే థాట్‌ను వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. ఇంతక ముందు హోమ్లీగా కనిపించిన ఆమె ప్రస్తుతం అవన్నీ మర్చిపోయి హద్దులు చేరిపేసి మరి టిల్లు స్క్వేర్ లో రెచ్చిపోయింది. దాంతో అనుపమను అలా చూసి తట్టికోలేక అనుపమ మీద అమ్మా.. నాన్న.. తమ్ముడికి కంప్లైట్ చేస్తున్నారట కొంత మంది ఫ్యాన్స్. అయితే ఇక్కడి వరకు బానే ఉన్నా అనుపమ అమ్మను అత్తని.. నాన్నను మామ అని.. తమ్ముడిని బామ్మర్ధి అని మెసేజ్‌లో కోట్ చేస్తున్నారని ఇంటర్వ్యూలో తెలిపింది అనుపమ.
Related News
Tillu Square OTT: టిల్లుగాడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల తార అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూ.125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు, అనుపమలతో పాటు నేహా శెట్టి, ప్రియాం�