Chandrababu : రేపు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu Anantapur Tour : శనివారం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయడంతో పాటు నేమకల్లు గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై అర్జీలు స్వీకరించనున్నారు
- By Sudheer Published Date - 12:12 PM, Fri - 29 November 24

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) రేపు (శనివారం) అనంతపురం జిల్లా(Anantapur District)లో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శనివారం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయడంతో పాటు నేమకల్లు గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై అర్జీలు స్వీకరించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు షెడ్యుల్ చూస్తే..
శనివారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి 11.40 గంటలకు చేరుకుంటారు.
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు.
బెంగళూరు విమానాశ్రయం నుంచి 12.45 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
12.45 నుంచి 12.50 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు
12.50 నుంచి 1.20 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు.
1.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.25 గంటలకు నేమకల్లు ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు.
1.25 గంటల నుంచి 1.55 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.
1.55 గంటల నుంచి 2.00 గంటల వరకు నేమకల్లులోని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత 3.05 వరకు గ్రామస్తులతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం 3.10 గంటలకు నేమకల్లు హెలిప్యాడ్ చేరుకొని 3.15 వరకూ అర్జీలు స్వీకరిస్తారు.
3.45 గంటలకు హెలీకాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు.
Read Also : Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి 5 కొత్త నిబంధనలు!