HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandra Babu And Jagan Again Going To Delhi

Babu-Jagan: హస్తినలో ఏపీ హీట్! ఢిల్లీకి బాబు, జగన్!!

రాజకీయ బద్ధ శత్రువులు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక చోట కనిపించ బోతున్నారు. ప్రధాని

  • Author : CS Rao Date : 04-12-2022 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Jagan
Babu Jagan

రాజకీయ బద్ధ శత్రువులు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక చోట కనిపించ బోతున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇద్దరు సోమవారం హస్తిన ప్రయాణం కడుతున్నారు. ఆ వేదికపై ఎవరి పెరఫార్మెన్సు ఎలా ఉండనుందో ఆసక్తిగా ఉంది. ఒకే సమావేశం ఒకటే ఎజెండా గా సాగే మీటింగ్లో జీ 20కి పనికి వచ్చే పాయింట్స్ మెరుగ్గా ఎవరు ఇస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. బీజేపీతో పొత్తులకు కూడా బాబు తెరతీయడం ద్వారా వైసీపీకి గట్టి రిటార్ట్ ఇస్తారని వినికిడి. ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయాలని చూస్తున్న చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ ని అనువుగా ఉపయోగించుకోనున్నారని తెలుస్తుంది.

జగన్ మీద గెలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు అన్నదే చంద్రబాబు వ్యూహమ్.గతంలో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళిన చంద్రబాబు మోడీతో చేతులు కలిపారు. సుదీర్ఘంగా కాలంగా ఏర్పడిన గ్యాప్ ని బాబు బాగా తగ్గించుకోగలిగారు.ఇపుడు మరో స్టెప్ ముందుకు వేసి ఏకంగా మోడీతో భేటీకే తెర తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ టూర్ తో మొత్తం గేం ని చేంజ్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈసారి కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి బాబు అంతా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీకి చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కూడా అటెండ్ అవుతున్నారు.

ఈ టూర్ ఏపీలో రాజకీయ పరిణామాలు మొత్తం మారిపోతాయని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు ఏపీలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో పాటు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తీయాలి అన్నదె బాబు విధానంగా కనిపిస్తోంది. జగన్ ఎదురుగానే ఆయన చూస్తూండగానే మోడీతో తన రిలేషన్స్ ని పెంచుకుని హస్తిన వేదికగా దెబ్బ తీసేందుకు వ్యూహం రచిస్తున్నారు. ఇక జగన్ మోడీతో భేటీ కి హాజరవుతారు. ఆ వెంటనే ఆయన తిరిగి వచ్చి కడప జిల్లా టూర్ కి వెళ్తారు. జగన్ ఢిల్లీని వీడి వచ్చినా కూడా బాబు ఎత్తుగడలను పరిశీలిస్తారు. బాబు రాజకీయాన్ని చూసి దాన్ని తిప్పి కొట్టే కౌంటర్ పాలిటిక్స్ కి జగన్ తెర తీస్తారని వైసీపీ వర్గాల్లోని టాక్. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వేదికగా ఏ రకమైన రాజకీయాన్ని అనుసరిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Babu-Jagan
  • chandrababu naidu
  • delhi
  • jagan

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd