Viveka Murder Case: అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash) సీబీఐ మరోసారి నోటీసులు పంపింది.
- By Balu J Published Date - 06:11 PM, Mon - 15 May 23

వివేకా (Viveka) హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సీబీఐ (CBI) పిలవడం, ఆయన హైకోర్టు ను ఆశ్రయించడం, సుప్రీంకోర్టు రియాక్ట్ కావడం లాంటివి జరిగిన విషయాలు. అయితే నెలలు గడుస్తున్నా కేసుకు ఫుల్ స్టాప్ పడకపోవడంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash) సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. రేపు హైదరాబాదులో విచారణకు రావాలంటూ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను సీబీఐ ఇప్పటికే మూడుసార్లు విచారించింది. ఈ సారి సీబీఐ ఎలా వ్యవహరిస్తుంది? అవినాశ్ రెడ్డి ఏవిధంగా రియాక్ట్ అవుతాడు? అనే విషయాలు ఉత్కంఠ రేపుబోతున్నాయి.
Also Read: Pooja Hegde: పాపం బుట్టబొమ్మ.. ఐటెం సాంగ్స్ కు రెడీ అంటున్న పూజాహెగ్డే?